నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన కొత్త చిత్రం "హంట్". ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్, యంగ్ కోలీవుడ్ హీరో భరత్ నివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ రోజు హంట్ టీజర్ విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు అర్జున్ అనే పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ కి మెమరీ లాస్ రావడంతో తన వృత్తిగత, వ్యక్తిగత నేపధ్యాన్ని పూర్తిగా మర్చిపోయి, వేరే మనిషిలాగా మారిపోతాడు. ఈ క్రమంలో పోలీస్ అర్జున్ సాల్వ్ చేయలేకపోయిన ఓ కేస్ ను ఇప్పుడున్న అర్జున్ సాల్వ్ చెయ్యాల్సి వస్తుంది. సుధీర్ ఆ కేస్ ను సాల్వ్ చేసారా? సుధీర్ బాబు కి మెమరీ లాస్ ఎందుకు వచ్చింది... ? కారణం ఎవరు? అనే ఇంటరెస్టింగ్ ప్రశ్నలను మిగిల్చిన టీజర్ ఎంగేజింగ్ గా ఉంది.
పోతే, ఈ సినిమాను మహేష్ సూరపనేని డైరెక్ట్ చేస్తుండగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.