టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం "ఓరి దేవుడా". ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు డైరెక్టర్ కాగా, మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఒక కీలకప్రకటన వచ్చింది. హీరోయిన్ ఆశా భట్ ఈ సినిమాలో మీరా అక్కగా నటిస్తున్నట్టు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
రీసెంట్గా విడుదలైన స్పెషల్ సర్ప్రైజ్ గ్లిమ్స్ తో ఒక్కసారిగా ఈ సినిమా ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాస్ప్ చేసింది. పీవీపీ సినిమాస్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.