టాలీవుడ్ టాప్ కంపోజర్ ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా ఇటీవలే 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నమోదు చేసిన ఈ మూవీ వెండితెరపై మాత్రం మ్యాజిక్ చెయ్యలేకపోయింది. దీంతో శ్రీసింహ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'ఉస్తాద్' పైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాకు రచయిత - డైరెక్టర్ ఫణిదీప్ కాగా, గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. వారాహి చలనచిత్రం, కృషి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీకి అకీవా సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రేపు సాయంత్రం 05:05 నిమిషాలకు ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ రాబోతుందని తెలుపుతూ, స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.
![]() |
![]() |