మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు టాలీవుడ్ లో లెక్కకు మించిన డైరెక్టర్లు ఉండగా, గాడ్ ఫాదర్ సినిమాతో మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే లైఫ్ టైం లక్కీ ఛాన్స్ ను కొట్టేసారు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా.
దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో మోహన్ రాజా మరియు చిత్రబృందం వరస ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటూ, సినిమాపై ప్రేక్షకుల్లో తగిన అంచనాలు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మోహన్ రాజా మాట్లాడుతూ... ఈ సినిమాలో మెగాస్టార్ కి ధీటుగా నిలిచే పవర్ఫుల్ విలన్ రోల్ లో సత్యదేవ్ నటించి, ఆ పాత్రకు ప్రాణం పోసాడు. సినిమా చూసిన తదుపరి చిరు తరవాత సత్యదేవ్ గురించే అంతా మాట్లాడుకుంటారు... అని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు కూడా సత్యదేవ్ ను ఒక రేంజులో పొగిడేశారు. మరి, సినిమాలో సత్యదేవ్ ఏ మాత్రం ఇరగదీసాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |