పల్లవి:
ఏకో రాజా విశ్వరూపధారి
శాసించే చక్రధారి
అంతే లేని ఆధిపత్య శౌరి
దండించే దండధారి
శాంతి కోసం రక్తపాతం
వీడు పలికే యుద్ధ పాఠం
నల్లదంధా నాగ లోకం
వీడు తొడిగే అంగుళీకం
కర్మ భూమిలోన వీడు ధర్మగామి
వేటుకొక్క చెడును వేటలాడు సామి
ఎక్కడుంటేనేమి మంచికితడు హామీ
ఒక్క మాటలోన సర్వాంతర్యామి
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్
చరణం :
ఆకసం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్ని గేయం
వీడో ధ్యేయం వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడినా రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపదా సంప్రదాయం
వీడో ధైర్యం వీడి పలుకు పాంచజన్యం
అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందిరాని చట్టం వీడే
లక్షలాది గుండె సడుల చుట్టం వీడే
అనుబంధం అంటే అర్థం వీడే
మంచి చెడ్డ పోల్చలేని ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని తర్కం వీడే
పై కంటి చూపు చూడలేని మర్మం వీడే
కరుణించే కర్తా కర్మా వీడే
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్