'గాడ్ ఫాదర్' ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ 'నా తమ్ముడి నిజాయితీ, నిబద్ధత నాకు తెలుసు. పవన్ లాంటి నాయకులు కావాలి. నా ఆకాంక్ష కూడా అదే. దానికి నా మద్దతు ఉంటుంది. మేం చెరోవైపు ఉండటం కంటే నేను తప్పుకోవటమే తనకు హెల్ప్ అవుతుందేమో. భవిష్యత్తులో తను ఏ పక్షాన ఉంటాడనేది ప్రజలు నిర్ణయిస్తారు. పవన్ కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.