చిన్నప్పటినుండి అమ్మాయిలంటే అస్సలు పడని ఒక అబ్బాయి, తన అలవాటును మార్చుకుని అమ్మాయిల గురించి తెలుసుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళకే అంతగా తెలియని విషయాలని తెలుసుకోవడం, ఇందుకోసం బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ గా మారడం ... అంతా కొత్త కాన్సెప్ట్, ఫన్ కంటెంట్ తో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ ట్రైలర్ యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
'కేరింత' ఫేమ్ విస్వంత్ దుద్దునపూడి, మాళవిక సతీషన్ కంభంపాటి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, స్వస్తిక సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, వేణుమాధవ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.