పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న తొలి పీరియాడికల్ యాక్షన్ డ్రామా "హరిహర వీరమల్లు". జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో గత కొంతకాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా హరిహర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్రబృందమంతా కలిసి ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల నుండి జరుగుతున్న ఈ వర్క్ షాప్ నేటితో ముగియబోతుందని డైరెక్టర్ క్రిష్ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. దసరా పండుగ అనంతరం మంచి ముహూర్తం చూసుకుని, నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై AM రత్నం నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ 2023 సమ్మర్ లో విడుదల కాబోతుంది.