బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "స్వాతిముత్యం". దసరా కానుకగా రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. లక్ష్మణ్ కే కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.
స్వాతిముత్యం ట్రైలర్ విడుదలైన తదుపరి ఈ సినిమా అచ్చు హిందీ సినిమా 'విక్కీ డోనర్' ని తలపిస్తుందని, విక్కీ డోనర్ కు అనఫీషియల్ రీమేక్ అని కొన్ని వార్తలు వినబడ్డాయి. వీటిపై హీరో గణేష్ స్పందిస్తూ, విక్కీ డోనర్ కి స్వాతిముత్యంకి కథ విషయంలో ఎలాంటి సంబంధం ఉండదని, కాకపోతే, ఆ మూవీ స్టోరీ పాయింట్ ను మాత్రం తీసుకున్నాం అని చెప్పారు.
ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.