మలయాళ బ్లాక్ బస్టర్ "లూసిఫర్" కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించగా, నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషించారు.
లూసిఫర్ కి, గాడ్ ఫాదర్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అందుకే గాడ్ ఫాదర్ ను మలయాళంలో కూడా విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ముందుగా ప్రకటించారు. ఐతే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ మలయాళ రిలీజ్ పై కీ అప్డేట్ ఇచ్చారు. మలయాళంలో గాడ్ ఫాదర్ విడుదల కావట్లేదని, గాడ్ ఫాదర్ తెలుగు రిలీజ్ ఐన ఒక వారం తదుపరి తమిళ్ లో రిలీజ్ అవుతుందని చెప్పారు.