శర్వానంద్, రీతువర్మ జంటగా కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేసిన సినిమా "ఒకేఒక జీవితం". ఇందులో అక్కినేని అమలగారు కీలకపాత్రను పోషించి, సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్ లా నిలిచారు.
డీసెంట్ టాక్, మంచి కలెక్షన్లతో అద్భుతమైన థియేటర్ రన్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. సోని లివ్ ఓటిటిలో అక్టోబర్ 10వ తేదీ నుండి ఒకేఒక జీవితం మూవీ స్ట్రీమింగ్ కు సిద్ధం కాబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.
డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు.