బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పద్నాలుగేళ్ల పాటు శ్రమించి, రీమేక్ హక్కులు సాధించి రూపొందించిన చిత్రం "లాల్ సింగ్ చద్దా". అక్కినేని నాగచైతన్య ఈ సినిమాలో కీలక అతిధి పాత్రలో నటించారు. కరీనాకపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.
థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. విడుదలకు ముందు ఆర్నెల్ల తరవాతనే ఓటిటిలోకి లాల్ సింగ్ చద్దాను తీసుకురావడం జరుగుతుందని చెప్పిన ఆమిర్ ఖాన్ 55 రోజుల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హాలీవుడ్ మూవీ "ఫారెస్ట్ గంప్" కి అఫీషియల్ ఇండియన్ రీమేక్. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి గారు సమర్పించి, ప్రమోట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa