యంగ్ హీరో హీరోయిన్లు అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు అక్టోబర్ 10న ధీంతానాన అనే లిరికల్ వీడియో విడుదల కాబోతుంది.
శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa