టాలీవుడ్ యంగ్ హీరో, ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతో యూత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపును సంపాదించిన సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త చిత్రం "లైక్ షేర్ సబ్స్క్రైబ్". ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. నెల్లూరి సుదర్శన్ కీరోల్ లో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ మ్యూజికల్ అప్డేట్ వచ్చింది. రేపు ఉదయం 11:07 నిమిషాలకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో సాంగ్ విడుదల కాబోతుంది. ఈ పాటను ప్రవీణ్ లక్కరాజు స్వరపరచగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. స్వీకర్ అగస్తి ఆలపించారు.
ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్. ముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.