బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ప్రస్తుతం గర్భిణీ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలియా తన భర్త రణ్ బీర్ మరియు, అత్త గారు, వదిన, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శ్రీమంతం వేడుకను సింపుల్ గా, స్వీట్ గా జరుపుకుంది. ఈ మేరకు ఆలియా శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 14న బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ ను ప్రేమించి పెళ్లాడింది ఆలియా. ఆ వెంటనే తాను ప్రెగ్నన్ట్ అన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేసి ప్రేక్షకాభిమానులతో సహా, కుటుంబ సభ్యులని ఆశ్చర్యపరిచింది.