దసరా కానుకగా నిన్న విడుదలైన మూడు సినిమాలలో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది "స్వాతిముత్యం" సినిమా. రెండు పెద్ద సినిమాలను తట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసి ఔరా అనిపిస్తుంది ఈ సినిమా.
పోతే, ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ తెలుగు ఓటిటి ఆహా సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానెల్ స్టార్ మా చేజిక్కించుకుందని వినికిడి. ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
బెల్లం కొండా గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు.