మాస్ హీరో గోపీచంద్ కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. రచయిత గోపీ మోహన్ ఈ సినిమాకి రచనలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'ఖిలాడీ' ఫేమ్ డింపుల్ హయాతి ఇందులో కథానాయిక. ఇందులో అలనాటి నటి ఖుష్బు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.