తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మారియా ర్యాబోషపాకా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమాని అక్టోబర్ 21న తెలుగు,తమిళ భాషల్లో థియేటర్లో రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.