పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. తాజాగా గురువారం హైదరాబాద్‌లో త్రీడీ టీజర్ ని రిలీజ్ చేసారు. అనంతరం టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాంటి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. మొదటి రోజు అన్ని సినిమాలకు నెగెటివ్ వైబ్స్ సర్వసాధారణం అన్నారు. పెద్ద స్క్రీన్ల కోసం ఈ సినిమా తీశారని.. ఫోన్లు, టీవీల్లో చూస్తే ఆ అనుభూతి కలగదని అన్నారు. ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా విజయం సాధిస్తుందని దిల్ రాజు అన్నారు.