ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. తాజాగా గురువారం హైదరాబాద్‌లో త్రీడీ టీజర్ ని రిలీజ్ చేసారు. అనంతరం ప్రభాస్ మాట్లాడారు. 'ఆదిపురుష్' సినిమా టీజర్ చూసి తాను చిన్న పిల్లాడిని అయిపోయినట్లు తెలిపారు. శుక్రవారం 'ఆదిపురుష్' సినిమా త్రీడీ టీజర్‌ను తెలుగు రాష్ట్రాల్లో 60 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ టెక్నాలజీ దేశంలో ఇదే మొదటిసారి అని చెప్పారు.