టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన "అల్లూరి" మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయిన ఈ సినిమా తాజాగా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అయ్యేందుకు రెడీ అయ్యింది.
తొలి తెలుగు ఓటిటి ఆహా (గోల్డ్)లో ఈ రోజు రాత్రి ఎనిమిదింటి నుండి అల్లూరి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా సంస్థ అధికారిక ప్రకటన కూడా చేసింది.
కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ వర్మ డైరెక్టర్. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.