ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణ్ బాలి (79) కన్నుమూశారు. ముంబైలో శుక్రవారం తెల్లవారుజామున ఆయన అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన చివరిసారిగా 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటించారు. బాలి '3 ఇడియట్స్', 'కేదార్ నాథ్', 'పానిపట్' వంటి అనేక ఇతర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆయన గత కొంతకాలంగా మస్తీనియా గ్రావిస్ అనే నాడీ కండరాల వ్యాధితో భాదపడుతున్నారు.