రష్మిక మందన్న ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది.ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. రష్మిక తాజాగా సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లూ కలర్ చుడిదార్ డ్రెస్ లో రష్మిక ఎంతో అందంగా వయ్యారాలు ఒలకబోస్తోంది. ప్రస్తుతం రష్మిక ఢిల్లీ టూర్ లో ఉంది. అందమైన ప్రాంతాల్లో తిరుగుతూ ఇలా ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చింది.వివిధ రకాల అవుట్ ఫిట్స్ లో ఫెమినా మ్యాగజైన్ కోసం రష్మిక ఫోటో షూట్ చేసింది.రష్మిక అందాలు చూస్తూ ఈ ఫొటోస్ ని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.