పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కొత్త చిత్రం "ఆది పురుష్". దసరా కానుకగా విడుదలైన టీజర్ ను లేటెస్ట్ గా 3డి వెర్షన్ లో సెలెక్టెడ్ ధియేటర్స్ లో స్క్రీన్ చేసారు.
హైదరాబాద్ లో జరిగిన ఆదిపురుష్ టీజర్ 3డి స్క్రీనింగ్ కి ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్, ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. 3డి లో ఆదిపురుష్ టీజర్ ను చూసిన ప్రతిఒక్కరు కూడా నెవర్ బిఫోర్ విజువల్స్ అండ్ కంటెంట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే, స్క్రీనింగ్ తదుపరి ప్రభాస్ మాట్లాడుతూ... మరికొన్ని వారాల్లో ఆదిపురుష్ కి సంబంధించిన బిగ్ బ్యాంగ్ కంటెంట్ తో మిమ్మల్ని కలవబోతున్నాం... అని అభిమానులకు తెలిపారు. దీంతో ఆదిపురుష్ టీం నుండి ఏదో బిగ్ సర్ప్రైజ్ రాబోతుందని, మోస్ట్లీ దీపావళికి రావొచ్చని తెలుస్తుంది.