అమైరా దస్తూర్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. అమైరా దస్తూర్ 2018లో విడుదలైన మనసుకు నచ్చింది సినిమాతో తెలుగుసినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రాజుగాడు సినిమాలో నటించింది.మొదటి సినిమాలో సందీప్ కిషన్ హీరో కాగా, రెండో దానిలో రాజ్ తరుణ్. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలను మహిళా దర్శకులే తెరకెక్కించారు. మంజుల ఘట్టమనేని మనసుకు నచ్చింది చిత్రాన్ని రూపొందించగా, జర్నలిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ సంజనా రెడ్డి రాజుగాడు ను తీశారు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగలో అంతగా రాణించలేదు.
ఈ బ్యూటీకి గ్లామర్ విషయంలో మాత్రం మంచి క్రేజ్ దక్కుతోంది అనే చెప్పాలి. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా అమైరా హాటెస్ట్ బ్యూటీలతో పోటీ పడుతోంది.ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ గ్లామర్ షోతో రచ్చ లేపుతోంది.