టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా, కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "ఓరి దేవుడా".
విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ "ఓహ్ మై కడవులే" కి అఫీషియల్ తెలుగు రీమేక్. అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి హైదరాబాద్ లోని AMB సినిమాస్ స్క్రీన్ 6లో జరగబోతుంది. ఈ ఈవెంట్లో సాయంత్రం 05:04 నిమిషాలకు ట్రైలర్ లాంచ్ కానుందని కొంచెంసేపటి క్రితమే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.