యువనటీనటులు సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం "లైక్ షేర్ సబ్స్క్రైబ్". తాజాగా ఈ సినిమా నుండి తొలి మ్యూజికల్ సింగిల్ విడుదలైంది.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ ఎంతకాలం ఉంటావే... అని హీరో హీరోయిన్ ప్రేమ కోసం ఎదురుచూస్తూ పాడే క్రమంలో వస్తుంది ఈ పాట. పోతే, ఈ పాటను స్వీకర్ అగస్తి ఆలపించగా, శ్రీమణి సాహిత్యం అందించారు.
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్, మీమీ గోపి, సప్తగిరి, బబ్లూ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతుంది.