చాలా ఏళ్ళ తదుపరి రాబోతున్న హిట్ పెయిర్ డైరెక్టర్ తేజ - మ్యూజిక్ డైరక్టర్ RP పట్నాయక్. వీరిద్దరి కాంబోలో వచ్చిన నువ్వు - నేను, జయం సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్.
మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిసి "అహింస" సినిమా కోసం పని చేస్తున్నారు. సో, ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలున్నాయి. ఈ మేరకు విడుదలైన అహింస ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ విషయం పక్కన పెడితే, రీసెంట్గా విడుదలైన అహింస టీజర్ కు ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతo యూట్యూబ్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది.
దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
![]() |
![]() |