టాలీవుడ్ యువనటుడు, మత్తు వదలరా సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శ్రీ సింహా ఆపై మత్తు వదలరా వంటి సాలిడ్ హిట్ అందుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, లక్ కలిసి రాక ఇంకా సక్సెస్ అందుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో కొంచెంసేపటి క్రితమే శ్రీసింహా తన కొత్త సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ను రివీల్ చేసాడు. 'భాగ్ సాలే' ఈ మూవీ టైటిల్ కాగా, ..ఏ క్రైమ్ కామెడీ అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో శ్రీ సింహ షర్ట్, సూట్ వేసుకుని, దానికి జతగా షార్ట్ ని వేసుకోవడం ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత వైవిధ్యంగా ఉండబోతుందో తెలుస్తుంది. అలానే ఈ పోస్టర్ లో శ్రీ సింహాతో పాటుగా రాజీవ్ కనకాల, యాంకర్ వర్షిణి, నెల్లూరు సుదర్శన్, హర్ష చెముడు, సత్య కూడా ఉన్నారు. శ్రీ సింహా చేతిలో కనిపించే ఒక రింగ్ సినిమా మొత్తాన్ని నడిపిస్తుందని తెలుస్తుంది.
ప్రణీత్ సాయి డైరెక్షన్లో ఇంటరెస్టింగ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్ సినిమాస్, సిని వ్యాలీ మూవీస్ సంయుక్త బ్యానర్ లపై అర్జున్ దాస్యం, యష్ రంగినేని, సింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్నారు.