మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బాబీ డైరెక్షన్లో పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ టీజర్ దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుందని టాక్. ప్రస్తుతానికైతే, ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వినికిడి.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa