ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై రష్మికను ఓ రిపోర్టర్ అడగ్గా, నవ్వుతూ మీరే కన్ఫర్మ్ చేశారుగా అంటూ స్పందించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రష్మికనే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఈ నెల 10న ఒక అప్ డేట్ రానుందట. ఇది ఎన్టీఆర్ కు 30వ సినిమా. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.