ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మెగా 154" లో రవితేజ రోల్ పై లేటెస్ట్ బజ్ ...!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 02:22 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154 వ చిత్రం "మెగా 154" (వర్కింగ్ టైటిల్). కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మాస్ రాజా రవితేజ కీలకపాత్రను పోషిస్తున్నారు.


షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, రవితేజ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ రోల్ లో నటిస్తున్నారని టాక్. మరి, మేకర్స్ ప్రకటించేంతవరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు.


శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa