తమిళ సీరియల్ సెవ్వంధీతో పేరొందిన నటి దివ్య శ్రీధర్ తన భర్త ఆర్నవ్‌పై పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది. కేలడి కన్మణి సీరియల్ చేస్తుండగా ఆర్నవ్‌తో ప్రేమలో పడ్డానని, సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అయితే మరో నటితో ఎఫైర్ కొనసాగిస్తున్న ఆర్నవ్‌ను తాను నిలదీయడంతో మరోసారి పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. తాను గర్భవతినని, తనకు-బిడ్డకు ఆర్నవ్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది.