కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న తొలి బైలింగువల్ చిత్రం "వారిసు". తెలుగులో "వారసుడు" టైటిల్ తో విడుదల కాబోతుంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉందని టాక్. కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలో ఒక టాక్ నడిచింది. తాజా సమాచారం ప్రకారం, వారసుడు సినిమాలో ఎలాంటి పాత్రను పోషించట్లేదని ఖుష్బూ క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది.