కొంచెంసేపటి క్రితమే యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" ట్రైలర్ విడుదలైంది. ఇన్నర్ మెసేజ్ తో, ఆద్యంతం ఫన్ ఫిల్డ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ సినిమాలో విశ్వక్ ఒక వివాహితుడిగా నటించాడు. విశ్వక్ చెప్పే... వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు సర్... కానీ, ఫ్రెండే వైఫ్ లాగొచ్చిందా... అని చెప్తూ దణ్ణం పెట్టే డైలాగ్ సినిమా నేపధ్యాన్ని వివరిస్తుంది. మోడరన్ గాడ్ గా వెంకటేష్ ప్రెజెన్స్ సినిమాకు హైలైట్ గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తమిళ మూవీ "ఓహ్ మై కడవులే" కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తునే తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేసారు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అందించిన డైలాగ్స్ ఫన్నీగా అనిపిస్తూనే, ఆలోచింపజేసేలా ఉన్నాయి. పీవీపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతుంది.