దివి ... బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో ఒకరిగా సూపర్ పాపులరైంది. ఆపై సినిమాలు, ఛానెల్ ఫంక్షన్స్ తో మరింత ఫేమ్ అండ్ క్రేజ్ తెచ్చుకుంది.
తాజాగా దివి "ఈక్విలైజర్ 3" అనే హాలీవుడ్ మూవీ సెట్స్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. దీంతో అందరూ దివి హాలీవుడ్ మూవీలో నటిస్తుందని అనుకున్నారు కానీ,,,, నిజానికి దివి ఇటలీ ట్రిప్ లో భాగంగా, ఈ మూవీ సెట్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న రాబర్ట్ రిచర్డ్సన్ వల్లనే ఇదంతా జరిగింది. ఎందుకంటే, మూడేళ్ళ క్రితం ఆయన ఇండియా లో చేసిన ఒక యాడ్ షూట్ కు దివి అసిస్టెంట్ గా పని చేసింది.