యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందూ మొండేటి డైరెక్ట్ చేసిన "కార్తికేయ 2" మూవీ ఇటీవల పాన్ ఇండియా భాషల్లో విడుదలై, ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చందూ మొండేటి డైరెక్షన్లో సోసియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ఉత్తరాదిన పెద్ద ప్రభంజనమే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసిన ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
దసరా కానుకగా అక్టోబర్ ఐదు నుండి కార్తికేయ 2 ప్రముఖ ఓటిటి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. హౌస్ ఫుల్ థియేటర్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కార్తికేయ 2 ఇప్పుడు ఓటిటీని కూడా కుమ్మేస్తుంది. 48గంటల వ్యవధిలో 100కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుని డిజిటల్ లో కూడా పెద్ద బ్యాంగ్ తో రికార్డులు సృష్టించడానికి రెడీ అయ్యింది.