టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన యాక్షన్ డ్రామా "జయం మనదేరా". అక్టోబర్ 7,2000లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఎన్. శంకర్ డైరెక్షన్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. వెంకటేష్ డ్యూయల్ రోల్ లో నటించారు. భానుప్రియ, ఝాన్సీ, ఆహుతి ప్రసాద్ కీలకపాత్రల్లో నటించారు. జయప్రకాశ్ నారాయణ్ విలన్గా నటించారు.
ఈ మూవీ వెంకటేష్ కు ఫిలింఫేర్ అవార్డును తీసుకువచ్చింది. ఈ సినిమాలో మహాదేవ నాయుడు, రుద్రమ నాయుడుగా వెంకటేష్ కనబరిచిన వైవిధ్యమైన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వందేమాతరం శ్రీనివాస్ అందించిన మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికీ శ్రోతల హాట్ ఫేవరెట్ ఆల్బమ్స్ లో ఒకటి.