మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా చిరంజీవి 'థాంక్యూ మై డియర్ సల్లూ భాయ్' అంటూ వీడియో రిలీజ్ చేసారు. గాడ్ ఫాదర్ సినిమా విజయంలో మసూద్ భాయ్ పాత్ర శక్తిలా నిలిచింది అని తెలిపారు.