కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సినీ నటి సమంత సైలెంట్‌గా ఉంటోంది. దీంతో ఆమెకు చర్మ వ్యాధి వచ్చిందని, చికిత్స కోసం అమెరికా వెళ్లిందని వదంతులు వచ్చాయి. దీనిపై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చినా, వదంతులు తగ్గలేదు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా సమంత స్పందించింది. తన పెంపుడు శునకం ఫొటో పోస్ట్ చేసి, 'వెనక్కి తగ్గాను.. కానీ ఓడిపోలేదు' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.