ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి మెరుపులాంటి డాన్స్ స్టెప్స్ తో, మెస్మరైజింగ్ నాచురల్ నటనతో ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుని, వారి హృదయాలలో తిష్ట వేసుకుని కూర్చుంది. లేడీ పవర్ స్టార్ గా మింగ్ బ్లోయింగ్ ఫ్యాన్ క్రేజ్ తో సాయి పల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.
ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సాయి పల్లవి రెండు అవార్డులతో సత్తా చాటింది. గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి ఆ రెండు సినిమాలకు గానూ ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది.
నాని కల్ట్ క్లాసిక్ "శ్యామ్ సింగరాయ్" లో, దేవదాసి 'మైత్రేయి' పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచినందుకు గానూ సాయిపల్లవి క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకోగా, లవ్ స్టోరీ సినిమాలో పక్కింటమ్మాయి మోనికా పాత్రలో ఒదిగిపోయినందుకు గాను ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.