భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి, సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 'బ్రహ్మ' గా మెగాస్టార్ చిరంజీవి పవర్ ప్యాక్డ్ యాక్షన్ కు అన్నివర్గాల ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా ప్రతిరోజు కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ రాంపేజ్ చేస్తుంది.
తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లను కలెక్ట్ చేసినట్టు మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఇంకొన్ని రోజుల వరకు ఏ కొత్త సినిమా లేకపోవడంతో గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ హవాకు ఎలాంటి అడ్డు లేనట్టే.
మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించగా, నయనతార, సత్యదేవ్, సునీల్, పూరీజగన్నాధ్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.