టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కాగా, ఆమె మృతి పట్ల మహేష్ బాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. నిన్న ఇందిరాదేవి సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో మహేష్ బాబు ఇంటికి రామ్ చరణ్ ఉపాసనతో కలిసి ఇందిరాదేవి సంస్మరణ సభకు హాజరయ్యారు.సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబులను సందర్శించి ఇందిరాదేవికి నివాళులర్పించారు.