నిన్న జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి నాచురల్ స్టార్ నాని అయ్యప్పస్వామి మాల ధరించి కనిపించారు. టాలీవుడ్ లో అయ్యప్పస్వామి భక్తులు చాలామందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, దగ్గుబాటి సురేష్ బాబు గారు... ఎక్కువశాతం అయ్యప్ప దీక్షను తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నాని కూడా చేరిపోయారు.
గతేడాది విడుదలైన 'శ్యామ్ సింగరాయ్' సినిమాకు గాను నాని ఫిలింఫేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయిపల్లవి కూడా క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.
ప్రస్తుతం నాని 'దసరా' మూవీ షూటింగ్లో ఉన్నారు. నాని తొలిసారిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు రెడీ అవుతుంది.