1989లో విడుదలైన "మైనే ప్యార్ కియా" సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతో భాగ్యశ్రీ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా దేశవ్యాప్త క్రేజ్ ను సంపాదించింది. ఆపై అడపాదడపా సినిమాలు చేసిన భాగ్యశ్రీ కుటుంబానికే ఎక్కువ సమయాన్ని కేటాయించింది.
ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "రాధేశ్యామ్" మూవీలో మెరిసింది భాగ్యశ్రీ. తాజాగా భాగ్యశ్రీ కూతురు అవంతికా దస్సాని టాలీవుడ్ డిబట్ ఎంట్రీ ఇవ్వబోతుందని అధికారిక సమాచారం అందుతుంది. బెల్లంకొండ గణేష్ రెండవ సినిమా "నేను స్టూడెంట్ సర్" లో అవంతికా హీరోయిన్ గా నటిస్తుంది. శృతి వాసుదేవన్ పాత్రలో అవంతికా నటించబోతుందంటూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు.
బెల్లంకొండ గణేష్ డిబట్ మూవీ స్వాతిముత్యం దసరా కానుకగా థియేటర్లలో విడుదలై, చాలా మంచి రివ్యూలను, డీసెంట్ కలెక్షన్లను అందుకుంటుంది.