శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటించిన 'ఒకే ఒక జీవితం' థియేటర్లలో విడుదలై హిట్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'సోనీ లివ్' ఓటీటీలో ఈ నెల 20 నుంచి ఈ సినిమాను మీరు చూడొచ్చు. ఈ సినిమాకు శ్రీకార్తిక్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రధానంగా టైమ్ మెషిన్‌తో గతంలోకి వెళ్లడం అనే కాన్సెప్ట్, అమ్మ సెంటిమెంట్ ఉంటుంది.