ప్రఖ్యాత ఆస్కార్ నామినేషన్స్ కు ఇండియా నుండి ఎంపికై, సెన్సేషన్ క్రియేట్ చేసింది గుజరాతి మూవీ "ది లాస్ట్ షో". ఈ సినిమాలో ఆరుగురు చైల్డ్ ఆర్టిస్టులు ముఖ్యపాత్రలు పోషించగా, అందులో ఒక పిల్లాడు రాహుల్ కోలి అనే పదేళ్ల బాలుడు మృతి చెందాడు.
లుకేమియా క్యాన్సర్ తో పోరాడి చిట్టచివరకు తుదిశ్వాస విడిచాడు రాహుల్ కోలి. గతేడాది విడుదలైన ఈ మూవీ అక్టోబర్ 14న మరోసారి రీ రిలీజ్ కాబోతుంది.
రీ రిలీజ్ కు ముందు రాహుల్ మరణించడం అతని తల్లిదండ్రుల సంతోషాన్ని ఆవిరిచేసింది. రాహుల్ అంతిమ సంస్కార కార్యక్రమాలు పూర్తి చేసి, అక్టోబర్ 14న ది లాస్ట్ ఫిలిం షో ను థియేటర్లో చూస్తామని రాహుల్ తండ్రి గద్గద స్వరంతో మీడియాకు చెప్పారు.