శర్వానంద్, రీతువర్మ జంటగా "ఒకేఒక జీవితం" అనే సైన్టిఫిక్ ఎమోషనల్ డ్రామా తెరకెక్కిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలానే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసి డీసెంట్ హిట్ కొట్టింది.
తాజాగా ఒకే ఒక జీవితం సినిమా డిజిటల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుండి సోనీ లివ్ ఇంటర్నేషనల్ ఓటిటిలో ఒకేఒకే జీవితం స్ట్రీమింగ్ కాబోతుందని సదరు సంస్థ అధికారిక ప్రకటనను వెలువరించింది.
కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించింది. అక్కినేని అమలగారు కీలకపాత్రను పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa