నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం "కృష్ణ వ్రింద విహారి". సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. చూసిన ప్రేక్షకులతో పాటు, విమర్శకులు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.
లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 23 నుండి కృష్ణ వ్రింద విహారి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. సో, ఎవరైతే ఈ మెసేజ్ ఓరియెంటెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను థియేటర్లో చూడలేకపోయారో, వారు నెట్ ఫ్లిక్స్ లో చూడడానికి రెడీగా ఉండండి.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూలుపురి ఈ సినిమాను నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa