మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ "ఆచార్య". విపరీతమైన అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. తొలిసారి మెగా ఫాదర్ అండ్ సన్ కలిసి నటించిన ఈ సినిమా ఘోర పరాజయం అందుకోవడం మెగా అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది.
ఆచార్య డిజాస్టర్ ను గాడ్ ఫాదర్ వచ్చి సమూలంగా పారద్రోలిన విషయం తెలిసిందే. తాజాగా ఆచార్య మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అక్టోబర్ 23 సాయంత్రం ఐదున్నరకు జెమినీ టీవీ ఛానెల్ లో ఆచార్య ప్రీమియం కానుంది.
కొరటాల శివ సక్సెస్ ట్రాక్ కు సడెన్ బ్రేక్ వేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాటినీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.